Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2016 13:28:03
facebook Twitter Googleplus
Photo

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది ?బాహుబలి: ది కంక్లూజన్? కోసం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడమే కాక.. బాహుబలి కథ ఎలా ముగుస్తుందో చూడాలన్న క్యూరియాసిటీ జనాల్లో ఉంది. ఆకాశాన్నంటుతున్న అంచనాల్ని అందుకోవడానికి రాజమౌళి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడనడంలో సందేహం లేదు.

జనాలకు ఆకాంక్షల్ని మించి తెరమీద అద్భుతాలు చేయడానికి తన టీంతో కలిసి శ్రమిస్తున్నాడు జక్కన్న. ఐతే ప్రేక్షకుల కోసం బాహుబలి-2లో కొన్ని సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ?బాహుబలి-2?లో కొత్తగా ఏ నటీనటులు ఉండరని.. తొలి భాగంలో ఉన్నవాళ్లే కంటిన్యూ అవుతారని అంటున్నప్పటికీ.. జనాల్ని సర్ ప్రైజ్ చేయడానికి ఒకరిద్దరు పెద్ద తారలతో నటింపజేస్తున్నట్లుగా యూనిట్ నుంచి సమాచారం అందుతోంది. అందులో ఒకరు ప్రముఖ నటి అంటున్నారు. ఇటీవలే ఆమెతో సంప్రదింపులు జరిగాయని.. ఆమె మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకుందని సమాచారం. ఐతే ఆ నటి ఎవరన్న హింట్ మాత్రం ఇవ్వట్లేదు.

సినిమా రిలీజయ్యే వరకు ఈ సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లకుండా జాగ్రత్త పాటిస్తున్నారట. ప్రస్తుతం ?బాహుబలి-2?కు సంబంధించి పని కొంచెం నత్తనడకన నడుస్తోంది. ఎండలు మండిపోతుండటంతో చాలామందికి సెలవులిచ్చేసి.. కొద్ది మంది నటీనటులతో రాజమౌళి చిన్న చిన్న సీన్లు తీసుకుంటున్నాడట. జూన్ నుంచి మళ్లీ ఉద్దృతంగా షూటింగ్ సాగుతుందని సమాచారం.

,  ,  ,  ,  ,