Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2016 12:26:54
facebook Twitter Googleplus
Photo

ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో సెలబ్రిటీలు హంగామా చేయడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. యంగ్ హీరోలు.. హీరోయిన్లతో పాటు.. దాదాపు కుర్రతరం అంతా సోషల్ మీడియాలో తమ సినిమాల అప్ డేట్స్ ను అందిస్తూ.. ఆన్ లైన్ లోనూ క్రేజ్ పెంచుకుంటున్నారు. కొంతమంది సీనియర్లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి.. అభిమానులకు మరింత చేరువయ్యేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బాలయ్యకు ఫేస్ బుక్ అకౌంట్ ఉండగా.. అందులో యాక్టివ్ గానే పోస్టులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ట్విట్టర్ ఖాతాను కూడా బాలయ్య ఓపెన్ చేయనున్నారట. బాలయ్య వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిని తీస్తున్న దర్శక నిర్మాతలు.. ఈమేరకు బాలయ్యను రిక్వెస్ట్ చేయగా.. ఆయన నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. శాతకర్ణి ప్రమోషన్స్ కు ఈ స్టెప్ ఉపయోగపడుతుందన్నది వారి ఆలోచన. బాలకృష్ణ ట్విట్టర్ ఎంట్రీపై సమాచారం అందిన అభిమానులు ఇప్పటికే హంగామా చేసేస్తున్నారు.

తమ అభిమాన హీరో తమకు మరింత చేరువ అయిపోతారన్నది వారి సంతోషానికి అసలు కారణంగా చెప్పచ్చు. క్లాస్ మాస్ తేడా లేకుండా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ.. ట్విట్టర్ ఫాలోయింగ్ లో కూడా రికార్డులు సృష్టించేయడం ఖాయంగా ఫిక్స్ అయిపోవచ్చు.

,  ,  ,  ,  ,