Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jan-2016 15:20:29
facebook Twitter Googleplus
Photo

ఎలాంటి మనిషైనా పిల్లల ముందు పిల్లాడిలా మారిపోతాడు అంటారు. మామూలుగా చాలా గంభీరంగా కనిపించే నందమూరి బాలకృష్ణ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. గత ఏడాదే ఆయన తాతగా మారిన సంగతి తెలిసిందే. తన కూతురు బ్రహ్మణి కొడుకైన దేవాన్ష్ అంటే బాలయ్యకు మహా ఇష్టం. ఎంతో మురిపెంగా మనవడి ముచ్చట్లు చెబుతుంటాడు బాలయ్య. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మనవడి సంగతులు పంచుకున్నాడు బాలయ్య. ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.

??నా మనవడు దేవాన్ష్ లో నా బాల్యాన్ని చూసుకుంటున్నా. వాడెప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. వాడు విపరీతంగా అల్లరి చేస్తాడు. ఆ అల్లరి నేర్పింది కూడా నేనే. షూటింగ్ కోసం నేను ఓ పది రోజులు బయటికి వెళ్లి వచ్చానంటే వాడు నన్ను మరిచిపోతాడు. ఎవర్రా నువ్వు అన్నట్లు చూస్తుంటాడు. ఐతే వాణ్ని బుట్టలో వేయడానికి నా దగ్గరో కిటుకు ఉంది. నా మెడలో గొలుసులు అవీ ఎక్కువ వేసుకుంటానన్న సంగతి తెలిసిందే. వాటిపైన వాడికి బాగా ఆసక్తి. ఆ గొలుసుల్లో ఒకటి చూపించి.. నేనురా తాతను అంటాను. అంతే.. గుర్తుపట్టి దగ్గరికొచ్చేస్తాడు. దేవాన్ష్ పుట్టాక వచ్చిన తొలి సంక్రాంతి కాబట్టి.. నాన్నతో కలిసి నారా వారి పల్లెకు వెళ్తున్నాడు. మేం కూడా వాడి వెంటే అక్కడికి వెళ్తున్నాం?? అని చెప్పాడు బాలయ్య.

,  ,  ,