Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2017 10:53:54
facebook Twitter Googleplus
Photo

సన్నీలియోన్తో కలిసి బాలయ్య ఆడిపాడితే ఎలా ఉంటుందో ఊహించుకొంటూ చాలా మంది ఇప్పటికే కలలు కన్నారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ తన కొత్త సినిమాలో బాలయ్య సరసన సన్నీని ఎంపిక చేశాడు కాబట్టి. సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చేయడం కోసం ఓ ఫెమిలియర్ హీరోయిన్ కావల్సి వచ్చింది పూరికి. దాంతో బాగా ఆలోచించి ఆ పాత్రని సన్నీలియోన్ కి అప్పజెప్పాలని డిసైడ్ అయ్యాడు పూరి. సన్నీ నటిస్తే క్రేజ్ మరోలా ఉంటుందనేది ఆయన ఆలోచన. సన్నీ నటిస్తున్న విషయాన్ని మీడియా ముందు కూడా ప్రకటించాడు పూరి.

అయితే ఏమైందో ఏంటో తెలియదు కానీ.. ఇప్పుడు ఉన్నట్టుండి సన్నీ ప్లేస్ లో బూచాడే... అంటూ అల్లు అర్జున్ తో రేసుగుర్రంలో సందడి చేసిన కయారా దత్ ని ఎంపిక చేశాడు పూరి. ప్రస్తుతం బాలయ్య పోర్చుగల్ లో ఉన్నాడు. అక్కడి షెడ్యూల్ పూర్తవ్వగానే ఇండియాకొచ్చి స్పెషల్ సాంగ్ లోనే ఆడిపాడనున్నాడట. అందుకోసం సెట్ కూడా తీర్చిదిద్దుతున్నారు హైదరాబాద్ లో. అయితే సన్నీని తప్పించి కయారాని ఎంపిక చేసుకోవడం గురించే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. బాలయ్య నిర్ణయం మేరకే సన్నీని తప్పించారని కొందరు కాదు.. కాదు ఆమె కాల్షీట్లు కుదరకనే అని మరికొందరు మాట్లాడుకొంటున్నారు.

,  ,  ,  ,  ,