Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2017 10:54:56
facebook Twitter Googleplus
Photo

త్రిపాత్రిభినయంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపై వీర విహారం మొదలుపెట్టేశాడు. ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా జైలవకుశకు విపరీతమైన బజ్ రావడంతో దాదాపుగా అన్ని థియేటర్లలోనూ అడ్వాన్సు బుకింగులు అయిపోయాయి. సినిమా ప్రమోషన్ పైన తారక్ కూడా గట్టిగానే ఫోకస్ చేశాడు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ నాటి నుంచి కొత్త కొత్త విషయాలు చెబుతూ మూవీపై ఆడియన్స్ లో ఆసక్తి పెంచడంలో సూపర్ గా సక్సెస్ అయ్యాడు. తాజాగా మూవీ ప్రమోషన్ టైంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ జై లవకుశ సినిమా కంప్లీట్ అయ్యాక ఇంతవరకు తాను సినిమా పూర్తిగా చూడలేదన్నాడు. చూడాలంటే టెన్షన్ గా ఉందని అందుకే చూడలేదంటూ చెప్పుకొచ్చాడు.

బాలకృష్ణ కోసం ఈ సినిమా ప్రత్యేకంగా షో వేశామని.. ఆయన చూసి ఈ సినిమా బాగుందని ఇప్పటికే బోలెడు ప్రచారం జరుగుతోంది. అయితే అవన్నీ అబద్ధాలే. బాలయ్య బాబాయ్ ఇంతవరకు ఈ సినిమా చూడలేదు. ఇంకా చెప్పాలంటే నేనే సినిమా మొత్తం చూడలేదు. సినిమాలో అక్కడక్కడ కొన్ని పార్టులు చూశానంతే. సినిమా మొత్తం చూడాలంటే ఏంటో కాస్త టెన్షన్ గా అనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ అన్న మాత్రం సినిమా మొత్తం చూశాడు. తను సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. బహుశా బాబాయ్ తర్వాత ఎప్పుడో చూస్తాడేమో అని ఎన్టీఆర్ సినిమా ఎవరు చూశారో క్లియర్ గా చెప్పేశాడు.

మా అబ్బాయి అభయ్ రామ్ కు ఇంకా వాళ్ల నాన్న ఫిలిం యాక్టర్ అన్న విషయం తెలీదు. వాడు ఇంతవరకు నా సినిమా ఒక్కటి కూడా చూడలేదు. వాడికి కార్టూన్లు చూడటమంటే ఇష్టం. వాడి ఐపాడ్ లో కార్టూన్లు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అంటూ తన కొడుకు ముద్దుమచ్చట్ల గురించి బయటపెట్టాడు తారక్.

,  ,  ,  ,  ,  ,