Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2017 10:24:21
facebook Twitter Googleplus
Photo

శమంతకమణి.. కథలో రాజకుమారి సినిమాలతో పలకరించాడు నారా రోహిత్. ఐతే అవి రెండూ రోహిత్ కు నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు అతడి ఆశలన్నీ బాలకృష్ణుడు మీదే ఉన్నాయి. గత నెలలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి రిలీజ్ డేట్ కూడా ఖాయం చేసుకున్నారు. నవంబరు నెలాఖర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 24వ తేదీకి బెర్తు కన్ఫమ్ చేసుకున్నారు. ఈ నెల తొలి మూడు వారాల్లో చాలా సినిమాలొస్తున్నాయి. దాదాపు పది సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి.

దీంతో రిస్క్ లేకుండా నెలాఖర్లో డేట్ ఫిక్స్ చేసుకున్నాడు రోహిత్. ఐతే ఆ తేదీకి కూడా పోటీ ఉండే అవకాశాలు లేకపోలేదు. ఒకట్రెండు చిన్న సినిమాలు నవంబరు 24 మీద దృష్టి పెట్టాయి. ఇక బాలకృష్ణుడు సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని పవన్ మల్లెల అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. నారా రోహిత్ సరసన రెజీనా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఇందులో మాస్ లక్షణాలున్న క్యారెక్టర్ చేశాడు రోహిత్. ఈ సినిమాకు తనకు మంచి కమర్షియల్ సక్సెస్ అందిస్తుందని రోహిత్ ఆశిస్తున్నాడు. మరోవైపు రోహిత్ వీర భోగ వసంత రాయలు అనే సినిమాతో పాటు బాణం దర్శకుడితోనూ ఓ సినిమా చేయబోతున్నాడు

,  ,  ,  ,  ,  ,