Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-May-2015 11:26:48
facebook Twitter Googleplus
Photo

అందానికే అందంగా కనిపించే తమన్నా .. రాశిఖన్నాలను వెంటేసుకుని 'బెంగాల్ టైగర్' సందడి చేస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని తన దూకుడు చూపిస్తున్నాడు. రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ సినిమాని సంపత్ నంది తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మూడవ షెడ్యూలు ఈ రోజు నుంచి ఆరంభమైంది. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో .. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారు.

జూన్ 15 వరకూ జరగనున్న ఈ షెడ్యూల్లో నాయకా నాయికలపై రెండు పాటలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. అందువలన ఈ షెడ్యూల్ షూటింగులో కథానాయికలతో పాటుగా ముఖ్యపాత్రధారులంతా పాల్గొంటారు. వినాయక చవితికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలనే ఉద్దేశంతో వర్క్ లో జాప్యం జరగకుండా చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో తన సినిమాలు మూసధోరణిలో లేకుండా రవితేజా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. కథలోని కొత్తదనం కారణంగానే ఆయన ఈ సినిమాని అంగీకరించాడని అంటున్నారు. మరి ఆ కొత్తదనం రవితేజా అభిమానులకి ఎంతవరకూ ఆనందాన్ని కలిగిస్తుందనేది చూడాలి.

,  ,  ,  ,  ,