Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2015 11:21:28
facebook Twitter Googleplus
Photo

'ఆవకాయ్ బిర్యానీ' ఫేం బిందు మాధవి తెలుగమ్మాయే అయినప్పటికీ, ఇక్కడ మాత్రం ఆమెకు ఆఫర్లు లేవు. పక్కనున్న కోలీవుడ్ మాత్రం ఆమెను అక్కున జేర్చుకుని అవకాశాలు ఇస్తోంది. ఈ క్రమంలో చిన్నా... పెద్దా... ఏ అవకాశం వచ్చినా వదలకుండా చేసుకుంటూపోతోంది. తాజాగా కూడా అలాగే ఓ తమిళ చిత్రానికి సంతకం చేసింది. 'జాక్సన్ దొరై' అనే సినిమాలో కథానాయిక పాత్రకు ఈ చిన్నది ఎంపికైంది. ధరణి ధరన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో సత్యరాజ్ తనయుడు సిబిరాజ్ హీరోగా నటిస్తుండగా... కీలక పాత్రల్లో సత్యరాజ్, కరుణాకరన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నయ్ లో జరుగుతోంది.

,  ,  ,