Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2017 15:17:00
facebook Twitter Googleplus
Photo

తొలిసారిగా బోయపాటి ఓ యంగ్ హీరోతో సినిమా చేయడంతో జయ జానకి నాయకా పై అందరిలో ఓ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాతో బోయపాటి కాస్త రూటు మార్చే అవకాశం ఉందని అందరు ఊహిస్తున్నా జయ జానకి నాయకా ట్రైలర్ చూస్తే మాత్రం అలా అనిపించడం లేదు. బెల్లకొండ శ్రీనివాస్ ని కూడా పవర్ ఫుల్ గా చూపించే ప్రయత్నం బోయపాటి చేసినట్లుగా అనిపిస్తుంది. బోయపాటి డైరెక్ట్ చేసిన గత హీరోలు అల్లు అర్జున్ - బాలకృష్ణ తదితరుల్ని ఏ రీతిన చూపించాడో అదే మాదిరిగా బెల్లకొండని సైతం ప్రొజెక్ట్ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా ఓ వైవిధ్యమైన పాత్రని బోయపాటి డిజైన్ చేశాడట. గ్లామర్ తారగా దూసుకుపోతున్న రకుల్ ని కాస్త డీ గ్లామర్ గా చూపించబోతున్నాడట బోయపాటి. అయితే జయజనాకి నాయక కథ పై పలు కామెంట్స్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నప్పటికి తన సినిమా కంటెంట్ మాత్రం కచ్ఛితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని థీమాగా చేబుతున్నాడు బోయపాటి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా బోయపాటి మార్క్ పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

,  ,  ,  ,  ,