స్టైలీష్ స్టార్ బన్నీ, మాస్ డైరక్టర్ బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతూ ఉంది. సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ అది సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపడం లేదు. ఈ విజయం ఇచ్చిన ఆనందంలో ఉన్న దర్శకుడు బోయపాటి అల్లు అర్జున్ తో త్వరలో మరో సినిమా చేస్తున్నట్లు సమాచారం.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసే సినిమా పూర్తి అయిన తరువాత ఈ సంవత్సరం చివర్లో అల్లు అర్జున్ తో సినిమా ప్రారంభం కావచ్చని సమాచారం. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ ని బోయపాటి ప్రజెంట్ చేసిన విధానానికి ఆయనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.