Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-May-2016 12:39:52
facebook Twitter Googleplus
Photo

ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు చేసుకుందాం అని మహేష్ మొన్న ఆడియో వేడుకలో స్వయంగా ప్రకటించినా.. ఇంకా అభిమానుల్లో సందేహాలు తొలగిపోలేదు. మహేష్ డబ్బింగ్ మొన్నే పూర్తి చేసినట్లు.. మిక్కీ జే మేయర్-గోపీసుందర్ కలిసి రీరికార్డింగ్ హడావుడిలో ఉన్నట్లు.. ఇంకా మిక్సింగ్ కార్యక్రమాలేవో జరుగుతున్నట్లు వార్తలొస్తుండటంతో బ్రహ్మోత్సవం అనుకున్న ప్రకారం 20న వస్తుందో రాదో అని ఏదో మూల కొడుతోంది అభిమానులకు. ఐతే ఆ సందేహాలన్నింటికీ తెర దించేస్తూ ఈ రోజు సాయంత్రం రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది బ్రహ్మోత్సవం టీం.

బ్రహ్మోత్సవం విడుదల ఈ నెల 20నే అంటూ ఈ సాయంత్రం రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేసింది పీవీపీ సంస్థ. బ్యాగు పట్టుకుని ఠీవిగా నడుచుకు వస్తున్న మహేష్ ఫొటోతో ఈ పోస్టర్ చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బ్యాగ్రౌండ్లో కాశీ వాతావరణం కనిపిస్తోంది. సినిమాలో మహేష్ బంధువుల మూలాల్ని వెతుక్కుంటూ వెళ్లే పాత్రలో కనిపించనున్న నేపథ్యంలో సినిమా ఎసెన్స్ చెప్పేలా ఈ పోస్టర్ తీర్చిదిద్దారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు. ముందు రోజు అమెరికాలో భారీ లెవెల్లో ప్రిమియర్ షోలు వేయనున్నారు. పీవీపీ సంస్థ రూ.70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన బ్రహ్మోత్సవంలో మహేష్ సరసన కాజల్.. సమంత.. ప్రణీత నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు.

,  ,  ,  ,  ,