Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2016 12:40:27
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ?బ్రహ్మోత్సవం? సినిమా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. ఈమధ్యే విడుదలైన ట్రైలర్, ఆడియోతో సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలన్నీ తారాస్థాయికి చేరిపోయాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మార్క్ ఎమోషన్, గ్రాండ్ విజువల్స్ అభిమానులను కట్టిపడేశాయి. ట్రైలర్ విడుదలైనప్పట్నుంచే యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ వస్తోంది. మహేష్ బాబు అఫీషియల్ చానల్‌లో ఈ ట్రైలర్ తాజాగా 1 మిలియన్ మార్క్‌ను దాటేసింది.
ఇక పీవీపీ సినిమా, జీ మ్యూజిక్ సౌత్ చానల్స్‌లోనూ అప్‌లోడ్ అయిన ఈ ట్రైలర్ అక్కడి వ్యూస్ కూడా కలుపుకుంటే 14 లక్షలకు పైనే వ్యూస్ సాధించింది. ఇక ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌ ఫీచర్స్ లిస్ట్‌లో కూడా టాప్ ప్లేస్‌లో ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. మహేష్ సరసన హీరోయిన్లుగా నటించిన సమంత, కాజల్, ప్రణీత ఈ ట్రైలర్‌కు మరింత అందాన్ని తెచ్చారు. శ్రీకాంత్ అడ్డాల మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను పీవీపీ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. మే 20న సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది

,  ,  ,  ,  ,  ,