Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2016 13:39:50
facebook Twitter Googleplus
Photo

దాదాపు 13 సంవత్సరాల తన సినీ జీవితంలో మొట్టమొదటిసారిగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. బోయపాటి శీను దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ?సరైనోడు? సినిమాలో అల్లు అర్జున్ ఓ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కొద్దిసేపు కనిపించబోతున్నట్లు సమాచారం. యం. యల్. ఏ అయిన కాథరిన్ థ్రెసా దగ్గర తను బాడీగార్డు గా పనిచేయబోయే ముందు వచ్చే సన్నివేశాల్లో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించబోతున్నట్లు తెలిసింది. ఈ రోల్ కోసం బన్నీ చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నట్లు తెలిసింది. ఈ పాత్ర ఉండేది కొద్దిసేపే అయినా బన్నీఈ పాత్రలో ఇరగదీసినట్టు తెలిసింది.
విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 22 న విడుదల కాబోతున్న ఈ సినిమాని అల్లు అరవింద్ నిర్మిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నది.

,  ,  ,  ,  ,  ,  ,  ,