Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2015 10:47:36
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ నటిస్తున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ విశేషం ఇప్పుడు టాలీవుడ్ లో ప్రచారంలో వుంది. బన్నీ తనయుడు అయాన్ ఈ చిత్రంలో తళుక్కున మెరిసి, అభిమానులను అలరించనున్నాడట. ఒక సన్నివేశంలో తండ్రితో బాటు అయాన్ కనిపిస్తాడని అంటున్నారు. అయితే, ఈ విషయంలో చిత్రం యూనిట్ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే కనుక, బన్నీ అభిమానులకు ఇది పండుగనే చెప్పచ్చు. అన్నట్టు, గతంలో అల్లు అర్జున్ కూడా బాల నటుడిగా కొన్ని సినిమాలలో కనిపించిన విషయం తెలిసిందే!

,  ,  ,  ,  ,  ,