Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Feb-2017 10:13:13
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ కాటమరాయుడుపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. పైగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నిరాశపరిచిన అనంతరం పవన్ కసిగా కొడతాడు అని అభిమానులు ఎదురుచూడటంతో పాటు ఈ సినిమా చేయడానికి అసలు కారణం... సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో నష్టపోయిన బయ్యర్ల కోసం కావడంతో వారంతా పవన్ కు ఒక రిక్వస్ట్ పెట్టుకున్నారట!

నిన్నమొన్నటివరకూ పొలిటికల్ గా బిజిగా ఉన్నట్లు కనిపించిన పవర్ స్టార్... సడన్ గా మళ్లీ షూటింగ్ లో బిజీ అయిపోవడానికి గల కారణం... బయ్యర్ల రిక్వస్ట్ అంట. ఇంతకూ ఆ రిక్వస్ట్ ఏమిటంటే... ఈ "కాటమరాయుడు" చిత్రాన్ని "బాహుబలి-2" కి కనీసం నాలుగు వారాల ముందు రిలీజ్ చేయాలనంట! పాత సినిమా నష్టాల పూడికతో పాటు కొత్త సినిమా లాభాలు కూడా బయ్యర్లు ఆశిస్తున్న తరుణంలో.. బాహుబలి తర్వాత కాటమరాయుడు వస్తే అప్పుడు ప్రేక్షకుల మూడ్ ఎలా వుంటుందోనని బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ తరుణంలో పవన్ సినిమా మాగ్జిమమ్ క్యాష్ చేసుకోవాలంటే బాహుబలి రావడానికి ముందు కనీసం నెలరోజుల వ్యవధి వుండాలని చెప్పారట.

దీంతో కాసేపు పొలిటికల్ విషయాలకు విరామమిచ్చి కాటమరాయుడిపై కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడట పవన్. అన్నీ అనుకూలంగా జరిగితే ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నరట. ఎందుకంటే.. ఏప్రిల్ 28న బాహుబలి 2 వచ్చేలోగా కాటమరాయుడు కలెక్షన్ టార్గెట్స్ రీచ్ అవుతాడు. అయితే ఈ క్రమంలో మార్చి 29 అంటే స్కూల్స్ - కాలేజీల్లో పరీక్షల సమయం కావడం ఏమైనా మైనస్ అవుతుందేమో అనే ఆలోచన కూడా చేస్తున్నారట! ఏది ఏమైనా... పవన్ కాటమరాయుడి విడుదలను బాహుబలి 2 డిసైడ్ చేయనుండటం గమనార్హం!

,  ,  ,  ,  ,