Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-May-2016 12:38:59
facebook Twitter Googleplus
Photo

ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది చిరంజీవి 150 సినిమా. కానీ ఆ సినిమాపై బోలెడు రూమర్లు. కథపై వివాదం నడుస్తుండడమే అందుకు కారణం. అయితే ఆ విషయాన్ని ఏమాత్రం లెక్క చేయడం లేదు చిరు. ఉత్సాహంగా పనుల్ని మొదలుపెట్టేశాడు. హీరోయిన్ ఎంపికని దర్శకుడికి అప్పగించి... తాను మ్యూజిక్పై కాన్సంట్రేట్ చేశాడు. శుక్రవారమే మ్యూజిక్ డిస్కషన్స్ మొదలయ్యాయి. దేవిశ్రీప్రసాద్ - చిరు కూర్చుని కథ గురించి మ్యూజిక్ గురించి చర్చించుకున్నారు. ఆ విషయాన్ని దేవిశ్రీ ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు. మెగాస్టార్ తో తొలి రోజు అంటూ ఓ సెల్ఫీ తీసుకొని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

సెల్ఫీలో దేవి లుక్కు కూడా డిఫరెంట్గా వుంది. ఆయన ఎప్పుడూ క్లీన్ షేవ్తో కనిపించేవాడు. కానీ ఇప్పుడు గెడ్డం మీసాలు పెంచేశాడు. దేవి కొత్త లుక్కు అదుర్స్ కానీ... చిరు సినిమాకి మ్యూజిక్ కూడా అలాగే వుండాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరు లుక్కు మాత్రం మారలేదింకా. మధ్యలో మీసం పెంచినట్టే పెంచి మళ్లీ మామూలు లుక్లోకి మారిపోయాడు. దీంతో చిరు 150 సినిమాలో ఏ లుక్కుతో కనిపించబోతున్నాడన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే వుంది. అయితే అన్నింటిపైనా ఇప్పటికే ఓ క్లారిటీతో ఉన్నారని ఇక షూటింగ్ మొదలవడానికి రెండు మూడు వారాల ముందు నుంచి కొత్త లుక్కు సిద్ధం చేసకుంటారని మెగా కాంపౌండ్ వర్గాలంటున్నాయి.

,  ,  ,  ,  ,  ,