Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2015 11:53:14
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ మళ్లీ వెండితెరకు వేంచేస్తున్న తరుణంలో ఆ సినిమాకు సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇది పిరీడ్ డ్రామాగా రూపొందుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి నటిస్తున్న ఈ 150వ సినిమాకున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా ఒక పాత్రను, ఆటో జానీగా మరో పాత్రను ఆయన పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్రీడం ఫైటర్ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందట. ఇక ఆటో జానీ క్యారెక్టర్ అభిమానులను అలరించే పక్కా మాస్. ఈ విధంగా రెండు పాత్రలను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. దీనికి 'ఆటో జానీ' అనే పేరు నిర్ణయించారు.

,  ,  ,  ,  ,  ,  ,