Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2016 12:48:29
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ ని రెండున్నర దశాబ్దాల పాటు శాసించిన పేరిది. స్టార్ కథానాయకుడు అనే మాటకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఘనత కూడా చిరుదే. అలాంటి చిరు హీరోగా సందడి చేసి తొమ్మిదేళ్లవుతోంది. శంకర్దాదా జిందాబాంద్ తరువాత హీరో పాత్రలకు విరామమిచ్చిన చిరు.. మగధీర - బ్రూస్ లీ చిత్రాల్లో అతిథి పాత్రల్లో సందడి చేశాడు. స్పెషల్ రోల్స్ తో మెప్పించినా.. ఫ్యాన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ అయితే అందలేదు. ఇలాంటి నేపథ్యంలో చిరు హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న అతని 150వ చిత్రం కత్తిలాంటోడు ఆ లోటు తీర్చేందుకు సిద్ధమౌతోంది. తమిళంలో విజయం సాధించిన కత్తికి రీమేక్ ఇది. ఒక విధంగా కత్తిలాంటోడుని మెగాస్టార్ కెరీర్ కి సంబంధించి థర్డ్ ఇన్నింగ్స్ గా చెప్పుకోవచ్చు.

చిరు తొలి ఇన్నింగ్స్ 'ప్రాణం ఖరీదు'తో మొదలైంది. ఇక రెండో ఇన్నింగ్స్.. బిగ్ బాస్... రిక్షావోడులాంటి వరుస పరాజయాల తరువాత కాస్త గ్యాప్ తీసుకుని 1997లో 'హిట్లర్' అనే మళయాల సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేయడం ద్వారా ప్రారంభమైంది. ఆ సినిమా తరువాత వరుసగా మాస్టార్... బావగారూ బాగున్నారా.. చూడాలనివుంది.. ఇంద్ర.. ఠాగూర్.. శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి హిట్ చిత్రాలను అందించాడు. ఇప్పుడేమో సుధీర్ఘ విరామం తరువాత 'కత్తి' అనే తమిళ రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

సెకండ్ ఇన్నింగ్స్ ని 'హిట్లర్' అనే మలయాళ చిత్రం రీమేక్ తో స్టార్ట్ చేసిన చిరు.. థర్డ్ ఇన్నింగ్స్ ని తమిళంలో విజయం సాధించిన 'కత్తి' రీమేక్ తో స్టార్ట్ చేస్తున్నాడు. మరి హిట్లర్ తో వర్కవుట్ అయిన లెక్క.. కత్తి రీమేక్ తో కూడా కుదురుతుందేమో చూడాలి.

,  ,  ,  ,  ,