Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Nov-2017 09:56:08
facebook Twitter Googleplus
Photo

చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా తిరిగి వస్తూ వస్తూనే ఇండస్ట్రీ రికార్డులను సెట్ చేసేశారు. ఇప్పటికీ పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులన్నీ ఖైదీ నంబర్ 150పేరిటే ఉన్నాయి. ఇంతలా ఇండస్ట్రీలో తన సత్తా చాటిన చిరంజీవి.. తన 151వ మూవీ విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కానీ ఆగస్టులో మెగా 151 సైరా నరసింహారెడ్డిపై అధికారిక ప్రకటన వచ్చినా.. ఇప్పటివరకూ సినిమా షూటింగ్ మొదలు కాలేదు. రీసెంట్ గా చిరంజీవి లుక్ టెస్ట్ లో పాల్గొనగా.. ఇప్పుడు తమిళ హీరో విజయ్ సేతుపతి.. నాజర్ లకు కూడా లుక్ టెస్ట్ నిర్వహించబోతున్నారు. ఆయా పాత్రలకు తగినట్లుగా ఎంపిక చేసిన మేకప్.. కాస్ట్యూమ్స్ తో ఈ లుక్ టెస్టులు జరుగుతున్నాయి. కానీ సినిమా షూటింగ్ ఎఫ్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై ఇఫ్పటివరకూ క్లారిటీ రాలేదు. రీసెంట్ గా మెగాస్టార్ ను కలిసిన ఫ్యాన్స్ కు.. ఈ అంశంపై స్పష్టత ఇచ్చారట చిరంజీవి.

డిసెంబర్ చివరలో కానీ.. జనవరి ప్రారంభంలో కానీ సైరా షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిపారట మెగాస్టార్. అంటే 2018లో చిరంజీవి మూవీ రిలీజ్ లేదని ఫిక్స్ అయిపోవాల్సిందే.

,  ,  ,  ,  ,  ,  ,