Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Nov-2016 11:18:09
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో ఇద్దరు సీనియర్ హీరోలకు చెందిన రెండు ల్యాండ్ మార్క్ మూవీస్ పోటీ పడి రెడీ అయిపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 150వ సినమా.. నందమూరి బాలకృష్ణ నటిస్తన్న 100వ సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని మరీ శరవేగంగా సిద్ధమైపోతున్నాయి. కానీ ఇలా వేగంగా రెడీ అవ్వాలంటే.. ఆయా హీరోలు పడే కష్టం కంటే.. వెనకాల ఉండే యూనిట్ కి చుక్కలు కనిపించేస్తూ ఉంటాయి.

షెడ్యూల్స్ ప్రకారమే కాదు.. రోజువారీ టార్గెట్స్ మేరకు పని పూర్తి కావాలంటూ దర్శకుడితో పాటు హీరో నుంచి కూడా తరచుగా హెచ్చరికలు వచ్చేస్తున్నాయని అంటున్నారు. కొన్ని సార్లు దర్శకుడితో పాటు హీరోగార్లు కూడా నోరు చేసుకుంటున్న సందర్భాలు ఉంటున్నాయట. దీంతో టెక్నీషియన్స్ కు టార్గెట్స్ అందుకోవడం తలకు మించిన భారం అయిపోతోందని టాక్. ఒకేసారి అవసరమైన అందరు టెక్నీషియన్స్ ను టైట్ షెడ్యూల్ లో తీసుకు రావడం.. ప్రొడక్షన్ మేనేజర్స్ కు బాగా కష్టం అయిపోతోందట. అలాగని ఎవరో ఒకరిని పట్టుకొచ్చేసి పని పూర్తి చేసే పరిస్థితి కూడా కాదు.

బాలయ్య శాతకర్ణి షూటింగ్ లో గ్రాఫిక్స్ ఇతర విషయాల్లోనూ.. చిరు ఖైదీ సంగతి చూస్తే క్లైమాక్స్ పిక్చరైజేషన్ పూర్తి చేయడానికి గాను.. టెక్నీషియన్స్ కు చుక్కలు కనిపించేస్తున్నాయని చాలామంది వాపోతున్నారట. అఫ్ కోర్స్.. వీళ్లందిరకి ఎప్పుడు ఊరట లభిస్తుందంటే.. తాము అంత కష్టపడి పని చేసిన సినిమా సక్సెస్ సాధించినపుడు.. ఇలాంటివన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయగలుగుతారు కదా!

,  ,  ,  ,  ,