Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2017 10:57:56
facebook Twitter Googleplus
Photo

జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఘంటా రవిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన జయదేవ్ చిత్ర ఆడియో లాంఛింగ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. చిరు అక్కడున్నాక.. ఆయనే సెంట్రాఫ్ అట్రాక్షన్ అవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అలాగే ఆయన మాటలు.. చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి కూడా.

నా తమ్ముడు ఘంటా శ్రీనివాసరావు కుమారుడు హీరోగా రూపొందే ఆడియోకు రావడం ఆనందంగా ఉంది. ఇక్కడికి రావడానికి కారణం ఘంటానే. రాజకీయాలతో ప్రయాణం ప్రారంభమైనా.. ఇప్పటికీ మా అనుబంధం ఉంది. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మారిపోయాడు. అంతటి ఆత్మీయత పంచగలుకొగుతాడు. ఘంటాను చూస్తుంటే తన కొడుకు కంటే తనకే ఎక్కువ మక్కువ ఉంది నాకు అనిపిస్తుంది. అప్పట్లో తను యాక్ట్ చేయాలని అనుకున్నాడేమో.. పరిస్థితులు కలిసి రాలేదేమో.. యాక్ట్ చేయమని నేను అన్నాను కూడా. రవి కారణంగా ఘంటా శ్రీనివాసరావుకు పుత్రోత్సాహంతో కలుగుతోంది అన్నారు చిరంజీవి.

రవిని చూస్తుంటే మాచో అనిపించింది. సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నపుడే హీరో మెటీరియల్ అనిపించింది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో అరంగేట్రం చేస్తుండడం ఒక శుభారంభంగా చెప్పచ్చు. ఇక్కడకు వచ్చిన ఇంతమంది ఆడియన్స్ ను చూస్తుంటే.. రేపు థియేటర్లలో కూడా ఇదే జోష్ కనిపిస్తుందని చెప్పచ్చు. కొత్త హీరో వచ్చేటపుడు లవర్ బోయ్ గా చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ రవి మాత్రం తన బాడీకి తగ్గట్లుగా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం చూస్తుంటే.. తొలి అడుగునే ఎంతో చక్కగా వేస్తున్నాడని చెప్పచ్చు అంటూ హీరో రవి పొగిడారు చిరు.

జయంత్ లాంటి వెర్సటైల్ డైరెక్టర్ తో సినిమా చేయడం తన అదృష్టం. కొత్త పాత అనే తేడా లేకుండా.. జయంత్ అందరు హీరోలతోను సినిమాలు చేశాడు. యాక్షన్.. ఫ్యాక్షన్.. లవ్.. ఇలా అన్ని జోనర్లలోను సినిమాలు తీసిన ప్రతిభ దర్శకుడిది. తన అందచందాలతో సినిమాకు గ్లామర్ తీసుకొచ్చిన మాళవికకు కూడా అభినందనలు అన్న చిరు ఆ తర్వాతే తనపై తానే సెటైర్ వేసుకున్నారు.

ఈ సినిమాతో మళ్లీ సినీ రంగానికి వస్తున్న అశోక్ కుమార్ కు కూడా అభినందనలు. ఇండస్ట్రీకి దూరంగా మళ్లీ ఈ సినిమాతో వస్తున్నావు. నిజానికి ఇండస్ట్రీని వదులుకుందామని అనుకున్నా.. అది మనల్ని వదలదు.. మళ్లీ రావాల్సిందే.. నేనే పెద్ద ఉదాహరణ అన్నారు చిరు. మణిశర్మ సంగీతం పెద్ద అసెట్.

,  ,  ,  ,  ,  ,