Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jul-2016 11:32:57
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ?కబాలి? సినిమా ప్రపంచవ్యాప్తంగా గత శుక్రవారం పెద్ద ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో నెలలుగా అభిమానులను ఎంతగానో ఎదురుచూయిస్తూ వచ్చిన ఈ సినిమా, ఓపెనింగ్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించింది. అయితే సినిమాకు మాత్రం అంతటా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా రజనీ సినిమా అంటే ప్రేక్షకులు కోరుకునే మాస్ హంగామా ఏదీ ఈ సినిమాలో లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది. రియలిస్టిక్ కథలనే తన సినిమాలుగా మలుచుకునే పా రంజిత్, ఈ సినిమానూ అదే కోవలో తెరకెక్కించానని తెలుపుతూ, ?కబాలి?పై వస్తోన్న విమర్శలపై స్పందించే ప్రయత్నం చేశారు.
??కబాలి? సినిమాను వీలైనంత రియలిస్టిక్‌గా తీయాలని ముందునుంచే అనుకున్నాం. సినిమాలో అందుకే అనవసర ఆర్భాటాలేవీ లేకుండా జాగ్రత్త పడ్డాం. రజనీ సార్ ఇమేజ్‌ని మాత్రమే క్యాష్ చేసుకునేలా కొన్నాళ్ళుగా సినిమాలు వచ్చాయి. నేను అందుకు భిన్నంగా ఆయనలోని అద్భుతమైన నటుడిని బయటకు తేవాలని కబాలి చేశా. నన్నడిగితే రియలిస్టిక్ సినిమాలు తీయడమే చాలా సులువు. కమర్షియల్ సినిమాల్లో అబద్ధాలను ఎక్కువగా చెప్తుంటాం. అందుకే అలాంటి సినిమాలు నావల్ల కాదు. ఇక కబాలి విషయంలో నన్ను ఎంతమంది పొగిడారో, అంతేమంది తిట్టారు కూడా. నేను అన్ని అభిప్రాయాలనూ తీసుకుంటా? అన్నారు. కళైపులి థాను నిర్మించిన ఈ సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్ల వసూళ్ళు సాధించడం టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారిపోయింది.

,  ,  ,  ,  ,  ,