Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2017 11:59:27
facebook Twitter Googleplus
Photo

ఒక సినిమా పలానా సినిమాకు కాపీ అనే టాక్ వచ్చినా.. లేదా ఒక సినిమా కథను వేరే కథ నుండి ఎత్తేశారు అనే టాక్ వచ్చినా.. వెంటనే అది నెగెటివ్ గా వైరల్ అయిపోతోంది. సినిమా బాక్సాఫీస్ దగ్గరకు వచ్చేలోపే ఈ టాక్ కారణంగా చాలామంది ఆడియన్స్ డిస్ కనక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ''నిన్ను కోరి'' సినిమా గురించి కూడా సేమ్ ఇలాంటి టాకే వస్తోంది.

మామూలుగా మన సినిమాల్లో ఒక హీరో.. ఇద్దరు హీరోయిన్స్ యాంగిల్ అనేకసార్లు చూసుంటాం. అలా ఒక అబ్బాయి ఇద్దరిని రొమాన్స్ చేస్తే పెద్దగా ఫీలవ్వని మన ఆడియన్స్.. ఒక అమ్మాయి ఇద్దరితో రొమాన్స్ చేస్తే మాత్రం బాగా హర్టవుతారు. స్ర్కీన్ ప్లే కొలతలో ఏ మాత్రం తేడా వచ్చినా కూడా జనాలు ఫీలైపోయి అలాంటి కథలను ఫ్లాప్ చేస్తుంటారు. ఇక్కడ చాలా డైరక్టుగా నివేథా థామస్ ను నానితో బ్రేకప్ చేయించి.. మళ్లీ ఆదితో కలిపేసి.. ఇప్పుడు జరిగే కథేంటో సినిమాలో చూడండి అంటూ ట్రైలర్ రిలీజ్ చేశారు నిన్ను కోరి టీమ్. అయితే ఈ సినిమా కథ సల్మాన్ ఖాన్ హీరోగా సంజయ్ లీలా భన్సాలి రూపొందించిన హమ్ దిల్ దే ఛూకే సనమ్ సినిమాకు బాగా దగ్గరగా ఉందంటూ కాపీ టాక్ వస్తోంది.

ఆల్రెడీ ఈ కాపీ టాక్ ను అర్ధం చేసుకున్న ఈ సినిమా టీమ్.. సినిమాలో కథ కీలక మలుపు తిరిగే సన్నివేశంలో.. ఇప్పుడు మన కథ హమ్ దిల్ దే ఛూకే సనమ్ సినిమా టైపులో మారబోతోంది అంటూ నాని చేత ఒక డైలాగ్ చెప్పించారని టాక్ వస్తోంది. ఇప్పుడే ఇలాంటి టాక్ అంతా వినిపిస్తే.. రేపు సినిమా రిలీజయ్యాక ఒకవేళ ఆ హిందీ సినిమాకు కాపీలా ఈ నిన్ను కోరి ఉంటే మాత్రం సోషల్ మీడియాలో జనాలు ఆడేసుకుంటారు.

,  ,  ,  ,  ,  ,