Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Feb-2017 11:28:22
facebook Twitter Googleplus
Photo

ఏంటి పెళ్ళిచూపులు క్రేజ్ మీద ఆధారపడి చాలా ఫీట్లు చేస్తున్నట్లున్నావ్ అని అడిగితే.. అవునండీ రేటు పెంచేశాను అంటున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. మనోడు ఈవారం రిలీజ్ అవుతున్న ద్వారక సినిమాను ప్రమోట్ చేస్తూ.. ప్రస్తుతం తన కెరియర్ ఓ రేంజులో దూసుకుపోతోందంటూ మంచిగా చెప్పేసిండులే.

''రెండు సంవత్సరాలు కష్టపడితే ఎవడే సుబ్రమణ్యం సినిమాలో రోల్ దక్కింది. అయితే ఆ రోల్ దక్కక ముందు ఎందుకైనా మనం బ్యాకప్ ఆప్షన్లు పెట్టుకుంటే మంచిదని అనిపించి.. రెండు కథలు రెడీ చేసుకున్నాను. ఒక షార్ట్ ఫిలిం కూడా డైరక్ట్ చేశాను. యాక్టర్ కాకపోతే డైరక్టర్ అయ్యుండేవాడిని'' అంటున్నాడు ఈ కుర్ర హీరో. అయితే పెళ్ళిచూపులు సినిమా రిలీజైన తరువాత మనోడి ఫేట్ మారిపోయింది. ఆ సినిమా రిలీజ్ కంటే ముందే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ ద్వారక ఇప్పుడు హైప్ తో రిలీజ్ అవ్వడానికి కారణం ఆ సక్సెస్సే. అంతేకాదు.. మనోడి చేతిలో ఇప్పటికిప్పుడు గీతా ఆర్ట్స్ వారివి రెండు సినిమాలూ.. అలాగే మరో నాలుగు సినిమాలు ఇతర బ్యానర్లలో ఉన్నాయంటే చూసుకోండి.

,  ,  ,  ,  ,