Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Feb-2017 12:48:06
facebook Twitter Googleplus
Photo

తమిళ స్టార్ హీరో ధనుష్ తనలో గొప్ప నటుడే కాకుండా దర్శకుడు కూడా ఉన్నాడని చెప్పడానికి పవర్ పాండి అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడమే కాక స్వయంగా రచించి, నిర్మిస్తున్నారు కూడా. 2016 లో మొదలైన ఈ చిత్ర షూటింగును ధనుష్ ఒకవైపు తన వేరే సినిమాల్లో నటిస్తూనే అనుకున్న సమయానికి పూర్తి చేస్తూ నిన్నటితో ముగించేశారు.
ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా చెబుతూ పవర్ పాండి షూటింగ్ పూర్తయింది. నా కల నెరవేరడానికి నాకు సహాయపడిన, సపోర్ట్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు అన్నారు ధనుష్. వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రాజకిరణ్ ప్రధాన పాత్రలో నటించగా గౌతమ్ మీనన్, ధనుష్ లు గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు

,  ,  ,  ,  ,