Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Feb-2017 10:16:11
facebook Twitter Googleplus
Photo

వీలైతే పవన్ కళ్యాణ్ ఫోటో పెడదాం.. లేదంటే ప్రమోషన్లో పవన్ పేరును వాడదాం. ఇదొక మంత్రం. ఒక ఫార్ములా. చాలామంది సినిమా హీరోలు వాడేశారు. అయితే తన కొత్త సినిమా ''విన్నర్'' కోసం మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఈ వాడకాన్ని పీక్స్ కు తీసుకెళ్ళిపోయాడు. అసలు మీడియా ఇంటర్యూ అంటే చాలు.. పవన్ గురించి ఏదో ఒక కొత్త విషయం చెప్పేసి న్యూస్ మేకర్ అయిపోతున్నాడు ఈ కుర్రాడు.

మొన్నటికి మొన్న విన్నర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. మా మావయ్య నాకో విషయం చెప్పాడు.. అంటూ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కొటేషన్ ఒకటి చెప్పిన సంగతి తెలిసిందే. నిజానికి ఆ కొటేషన్ ''యు కెన్ విన్'' వంటి పుస్తకాల్లో అనేకసార్లు చదవే ఉంటారు జనాలు. కాని పవన్ కళ్యాణ్ మామయ్య నాకు చెప్పాడు అనగానే.. సాయిధరమ్ స్పాట్ లైట్లోకి వచ్చేశాడు. ఇప్పుడు ప్రింట్ మీడియాకు ఇంటర్యూలు ఇస్తూ.. పవన్ కళ్యాణ్ మామ నా సినిమా ఒక్కటి కూడా చూడనేలేదు అంటూ మరో బాంబ్ పేల్చాడు. అది నిజమే అయ్యుండొచ్చులే.. ఎందుకంటే పవన్ తన సొంత సినిమాలనే తాను చూసుకోడు. అందుకేగా ఒక్కోసారి రిజల్టు అలా ఉంటుంది.

గోపిచంద్ మలినేని డైరక్షన్లో వస్తున్న ''విన్నర్'' సినిమాను.. ఇటు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ప్రమోట్ చేయడం అటుంచితే.. అటు రకుల్ ప్రీత్ అండ్ అనసూయల గ్లామర్ తో కూడా తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ కలసి ఫిబ్రవరి 24న తేజ్ ను కాపాడాతాయో లేదో చూడాల్సిందే.

,  ,  ,  ,  ,  ,