Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jan-2017 10:52:44
facebook Twitter Googleplus
Photo

శతమానం భవతి సక్సెస్ మీట్ లో.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. ఆడియో ఫంక్షన్ కు కాకుండా.. సక్సెస్ అయ్యాక.. సక్సెస్ మీట్ కు చిరును ఎందుకు పిలిచారనే విషయం ఎవరికీ అర్ధం కాలేదు. తనకు నిర్మాతగా జన్మనిచ్చిన వివి వినాయక్ కు సన్మానం చేసిన దిల్ రాజు.. ఆ కార్యక్రమం కోసమే చిరంజీవిని ఆహ్వానించానంటూ అసలు కారణం చెప్పాడు.

కష్టాలు నష్టాలు ఎన్నో దాటుకుంటూ.. బెల్లంకొడ సురేష్ గారు ఆది సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. అప్పుడు వినయ్ కలిస్తే.. ఇక్కడే ప్రసాద్ ల్యాబ్ లో సినిమా తియ్యాలని ఉంది అంటూ ఓ చెట్టుకింద 3లక్షల 3 వేల రూపాయల చెక్ ఇచ్చాను. ఆది రిలీజ్ తర్వాత దిల్ అనే మూవీ మొదలుపెట్టించి.. ఆ సినిమా ద్వారా ఎలా ప్రయాణించానో నాకు తెలుసు. అప్పుడే మొదటి సినిమా తీస్తున్న నాకు.. ఇక్కడి నుంచి స్టోరీ సిటింగ్స్ కోసం వైజాగ్ తీసుకెళ్లాడు. అప్పటివరకూ అవెలా ఉంటాయో కూడా నాకు తెలీదు. టీం అందరితో పాటు నన్ను తీసుకెళ్లి.. సింగిల్ లైన్ ఎలా రాయాలి.. సీన్స్ ఎలా ఉండాలి అని నేర్పించాడు' అంటూ వినాయక్ గురించి మరిన్ని సంగతులు చెప్పాడు దిల్ రాజు.

ఆ టీంలో సుకుమార్.. వాసు వర్మ ఉన్నారు. తను ఠాగూర్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో.. మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఆర్పీ పట్నాయక్ తో కలిపి పంపించాడు. ఇవన్నీ చూడమ్మా.. అయ్యాక తీసుకురా అన్నాడు. దుబాయ్ షూటింగ్ ఉండే సాంగ్ తీసుకురండి అంటూ మమ్మల్నే పంపించాడు. మొదటి సారి నేను ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకునే అవకాశం ఇచ్చి.. మొదటి సినిమా దిల్ ద్వారా.. నా ఇంటిపేరునే దిల్ చేసేశాడు వివి వినాయక్. అమ్మానాన్నలు జన్మనిస్తే.. శతమానం భవతి వంటి సక్సెస్ వరకూ జర్నీ చేసేలా నాకు మొదటి సక్సెస్ ని ఇచ్చిన మా వినాయక్ కి ఎంత చేసినా నేను తక్కువే' అన్నాడు దిల్ రాజు.

'వినాయక్ కు సన్మానం చేయాలంటే ఎవరితో అయితే రేంజ్ ఉంటుంది అని ఆలోచిస్తే.. టక్కుమని చిరంజీవి గారు గుర్తొచ్చారు. జనవరి 14 న రిలీజ్ అయితే.. అంతకు ముందు జనవరి 11న చిరంజీవి గారి సినిమా వచ్చింది. రెండు పెద్ద సినిమాల మధ్యలో రావడంతో.. ఎవరూ పట్టించుకోలేదు. ఇండస్ట్రీ నుంచి నాకు కాల్స్ రాలేదు. కానీ మూడో రోజున ఓ కాల్ వచ్చింది. అది మిస్ అయ్యి.. ఆ తర్వాత నేను రీకాల్ చేస్తే.. నేను చిరంజీవిని అన్నారు. 'కంగ్రాట్స్ రాజూ.. నీ సినిమా చాలా బాగుందని అందరూ చెబుతున్నారు. తన సినిమా హిట్ అయినా.. ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేశారంటే అదీ చిరంజీవి గారు. ఆ నెక్ట్స్ డే చిరంజీవి గారి దగ్గరికి వెళ్లిపోయి ఈ విషయం చెప్పాను. దిల్ నుంచి ఇప్పటి వరకూ 8 మంది కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేసే అవకాశం దక్కింది' అని చెప్పిన దిల్ రాజు.. ఆ తర్వాత చిరుతో గత అనుబంధం గురించి పంచుకున్నాడు.

'చిరంజీవిగారు ఉదయాన్నే కలిసినప్పుడు కూడా చెప్పారు. నాకు గుర్తుంది.. పరుగు అనే సినిమా ఆడియో ఫంక్షన్ లోనే ఈసంస్థ ను.. రామానాయుడు గారి సంస్థ లాగా.. నాగిరెడ్డి-చక్రపాణి లాగా అంటూ పదేళ్ల క్రితమే మా సంస్థకు మీరు పెట్టారు సార్. ఆ పేరును నిలబెట్టడానికి ప్రతీ సినిమాను ఏదో ఒక కొత్తగా తీయడానికే ప్రయత్నం చేస్తాను. మీ లాంటి వాళ్ల అందరి ఆశీస్సులతో.. ఇంకా మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తాను' అంటూ మెగాస్టార్ చిరంజీవిపై తన గౌరవాన్ని చాటుకున్నాడు దిల్ రాజు.

,  ,  ,  ,  ,