నందమూరి హీరో కల్యాణ్ రామ్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇటీవల 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రం ద్వారా విజయాన్ని సొంతం చేసుకున్న ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఇందుకు సంబంధించిన కథను కల్యాణ్ రామ్ ఓకే చేసినట్టు సమాచారం. 'పటాస్' చిత్రంతో ఈమధ్య మంచి హిట్టు కొట్టిన ఈ నందమూరి హీరోని ఈ సినిమా సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి
dilraju, kalyanram, news, newmovie, staringsoon,