Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Dec-2017 10:25:31
facebook Twitter Googleplus
Photo

ఎంసీఏ సినిమాకు టాక్ కొంచెం అటు ఇటుగా వచ్చింది. ఐతే విశ్లేషకుల అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ ఎంసీఏ కు అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయని.. ఇది బిగ్ హిట్ కాబోతోందని అన్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ ఏడాది తాను నిర్మించిన ఆరో సినిమా కూడా హిట్టే అని.. ఈ బంతి కూడా బౌండరీ దాటేసిందని ఆయన ప్రకటించాడు.

సాయంత్రానికే సక్సెస్ మీట్ పెట్టేసి.. తన సినిమా సూపర్ హిట్ అని ప్రకటించాడు దిల్ రాజు. తాను ప్రమోషన్ కోసం ఈ మాటలు చెప్పట్లేదని.. నిజాయితీగా ఉంటానని.. ఉదయం 4.30కు న్యూజెర్సీ నుంచి ‘ఎంసీఏ’ గురించి ఫస్ట్ రిపోర్ట్ వచ్చిందని.. తర్వాత అందరూ పాజిటివ్ ఫీడ్ బ్యాకే ఇచ్చారని రాజు అన్నాడు. ఫస్ట్ హాఫ్ అదిరిందని.. సెకండాఫ్ కొంచెం డౌన్ అయిందని అంటున్నారని.. క్లైమాక్స్ విషయంలో మెచ్చుకుంటున్నారని రాజు అన్నాడు. రాయలసీమ ప్రాంతం నుంచి డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేశారని.. నేను లోకల్ కన్నా 25 శాతం అదనంగా వసూళ్లు వస్తాయని చెప్పారని రాజు అన్నాడు.

విశ్లేషకులు తమ సినిమా గురించి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ.. ఒక సినిమాకు ఎంత ఖర్చు పెట్టాం.. ఎంత వసూలైంది అన్నదే తాను చూస్తానని.. ఎంసీఏ కు ఊహించని స్థాయిలో వసూళ్లు వస్తున్నాయని.. కాబట్టి విశ్లేషకులు ఒకవైపు.. రెవెన్యూ ఒక వైపు అని.. ఈ సినిమా ఎంత పెద్ద స్థాయికి వెళ్తుందో మున్ముందు చూస్తారని అన్నాడు రాజు.

,  ,  ,  ,  ,  ,