Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Apr-2016 13:28:42
facebook Twitter Googleplus
Photo

ఇంతకుముందు వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు తీసిన దిల్ రాజు.. ఈ మధ్య ఆచితూచి అడుగులేస్తున్నాడు. చిన్న.. మీడియం రేంజి హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. సాయిధరమ్ తేజ్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో ?సుప్రీమ్? సినిమాను పూర్తి చేసిన రాజు.. దీని తర్వాత యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా ?శతమానం భవతి?ని సెట్స్ మీదికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగానూ ఓ సినిమా సెట్ చేశాడు రాజు. ఈ చిత్రానికి ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించబోతున్నాడు.

రవికుమార్ చౌదరి ఇప్పటికే దిల్ రాజు బేనర్లో ?పిల్లా నువ్వు లేని జీవితం? లాంటి హిట్టిచ్చాడు. ఐతే ఆ తర్వాత అతను తీసిన ?సౌఖ్యం? మాత్రం డిజాస్టర్ అయింది. అయినప్పటికీ రాజు అతడికి అవకాశం ఇస్తుండటం విశేషమే. తన బేనర్ కు మంచి విజయాన్నిచ్చాడన్న కృతజ్నత కావచ్చు. ఇక కళ్యాణ్ రామ్ విషయంలో రాజు గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాడు. గత ఏడాది ?పటాస్? సినిమాను చాలా తక్కువ రేటుకే కొని.. భారీగా లాభాలు అందుకున్నాడు రాజు. అప్పుడే మనిద్దరం కలిసి సినిమా చేద్దామని హామీ ఇచ్చాడు. ఇలా తనకు మంచి లాభాలు అందించిన దర్శకుడు.. హీరోతో సినిమా చేయబోతున్నాడు రాజు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అదయ్యాక రాజు సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది.

,  ,  ,  ,  ,  ,