Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2016 10:40:13
facebook Twitter Googleplus
Photo

దర్శకుడిగా తొలి సినిమా పిల్ల జమీందార్ తో ఇండస్ట్రీ దృష్టిని బాగానే ఆకర్షించాడు అశోక్. రెండో సినిమా సుకుమారుడు బోల్తా కొట్టినా.. ఆ తర్వాత రెండు క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టాడు. అవి రెండూ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే. అందులో ఒకటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రాంగద. ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. విడుదల కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు అనుష్క ప్రధాన పాత్రలో యువి క్రియేషన్స్ నిర్మాణంలో ?భాగమతి? అనే భారీ సినిమా చేస్తున్నాడు అశోక్. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నాడు అశోక్. ఆ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.100 కోట్లట.

అప్పట్లో కేరళలోని తిరువనంతపురం వద్ద అనంతపద్మనాభస్వామి నేలమాళిగలో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడ్డ సంగతి తెలిసిందే. దాని నేపథ్యంలో సినిమా చేయబోతున్నాడట అశోక్. తెలుగు.. తమిళం.. కన్నడ.. హిందీ భాషల్లో దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను అశోక్ తెరకెక్కించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమా కోసం నాలుగు భాషల నుంచి నటీనటులను ఎంపిక చేస్తారట. ఈ చిత్రాన్ని నిర్మించడానికి అభిషేక్ పిక్చర్స్ ముందుకొచ్చినట్లు సమాచారం. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తాడట అశోక్. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అశోక్ స్థాయికి వంద కోట్ల సినిమా అంటే ఆశ్చర్యకరమైన విషయమే. ఇందులో వాస్తవమెంతో చూద్దాం మరి.

,  ,  ,  ,  ,  ,