Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Feb-2017 10:54:07
facebook Twitter Googleplus
Photo

సరైనోడు అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే అంటూ దువ్వాడ జగన్నాధంగా రాబోతోన్నాడు. బెజవాడ పంతులు గెటప్ లో స్టైలిష్ స్టార్ లుక్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తేనే.. ఈ మూవీపై ఎంత క్రేజ్ ఉందనే విషయం అర్ధమవుతుంది.

కంప్లీట్ గా బ్రాహ్మిన్ గెటప్ లో బన్నీ చేయనున్న సందడి ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణ అయితే.. ఇప్పుడీ సినిమా శాటిలైట్ రైట్స్ ను అమ్మిన ధర ఇండస్ట్రీకి షాక్ కొట్టించేస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు బోలెడంత డిమాండ్ ఉండడంతో రిలీజ్ కి ముందే శాటిలైట్ పూర్తయిపోతుంది. డీజేని కూడా ఇలాగే టఫ్ కాంపిటీషన్ మధ్య జీ తెలుగు ఛానల్ దక్కించేసుకుంది. ఇది ఇప్పటివరకూ బన్నీ సినిమాల్లోనే కాదు.. తెలుగు సినిమా శాటిలైట్ విషయంలోనే రికార్డ్ ప్రైస్ అంటున్నారు. కానీ.. ఎంత రేటుకు డీజే రైట్స్ ను ఈ ఛానల్ దక్కించుకుందనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచేశారు.

డీజే మూవీపై నిర్మాత దిల్ రాజు భారీగానే బిజినెస్ చేసేస్తున్నట్లు వినికిడి. వరుస హిట్స్ తో ఉన్న అల్లు అర్జున్ ఉండడం.. దిల్ రాజు ఫామ్ లో ఉన్న నిర్మాత కావడం.. ఈ మూవీ బిజినెస్ రేంజ్ ను అమాంతం పెంచేస్తోంది. డీజే తో కనీసం 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని అంటున్నారు

,  ,  ,  ,  ,  ,