Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Sep-2016 13:54:32
facebook Twitter Googleplus
Photo

ఒకప్పుడు అసలు హీరో సునీల్ కోసం హీరోయిన్లు వెతకాలి అంటే కష్టమేసేది. ఆ మధ్యన అందుకే ఇషా చావ్లా అనే అమ్మాయిని రెండు రిపీట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. సునీల్ సినిమాలకు కూడా బాక్సాఫీస్ దగ్గర ఢోకాలేదనే టాక్ రావడంతో ఇప్పుడు మనోడి కోసం సెక్సీ భామలు బాగానే క్యూ కడుతున్నారు.

స్టార్ హీరోయిన్లకు ఇంకా సునీల్ సినిమాలో మెరిసే భాగ్యం రాకపోయినప్పటికీ.. త్వరలో విడుదల కాబోయే ''వీడు గోల్డ్ ఏహే'' సినిమాలో తెలుగు పిల్ల సుష్మా రాజ్ అలాగే మరో హాటీ రిచా పనయ్ లు నటిస్తున్నారు. ఈ సినిమాలో గ్లామర్ చిందించడానికి జిమ్ములో కూర్చుని పక్కా యాబ్స్ తయారు చేసుకున సుష్మా.. అలాగే ఇప్పటికే బికినీలు కూడా వేసుకుని మతిపోగొట్టిన రిచా పనయ్.. ఇప్పుడు ఈ సినిమాలోని ఒక పాటలో తమ మాస్ లుక్కుతో దంచేశారంతే. ఇద్దరూ కూడా చిన్న లుంగీ కట్టుకుని సోకులను ఆరబోస్తూ.. నానా హడావుడి చేస్తున్నారు. ఊర మాస్ అనేట్లుంది వీరి యవ్వారం.

ఇకపోతే సడన్ గా దసరా సీజన్ నుండి 'ధృవ' సినిమా తప్పుకోవడంతో.. ఇప్పుడు సునీల్ కూడా అక్టోబర్ 7న రావడానికి ప్లాన్ చేసుకున్నాడు. పెద్ద పండుగ. పాపలేమో ఊర మాస్. సునీల్ కు మాస్ ఫ్యాన్స్ ఎక్కువే. అన్నింటినీ కలిపితే మరి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటారా? చూద్దాం రైటర్-డైరక్టర్ వీరు పోట్ల ఈసారి ఎటువంటి సినిమాను తీశాడో మరి.

,  ,  ,  ,  ,  ,