Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Apr-2016 13:06:53
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ పుట్టిన రోజు విషయంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చాలా హడావుడి జరిగింది. దేశ విదేశాల్లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించడం.. భారీ ఎత్తున అభిమానులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి.. బ్లడ్ డొనేట్ చేయడం విశేషం. ఈ శిబిరాల్లో మొత్తం 76 వేల మంది రక్తదానం చేశారు ఒకేసారి 76 వేల యూనిట్ల రక్తదానం అంటే అది చాలా పెద్ద విశేషమే. దీని వల్ల ఎందరో ప్రాణాలు నిలబడతాయి. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ లో ఇదొకటని చెప్పాలి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు ఎప్పట్నుంచో రక్తదానం జరుగుతోంది కానీ.. ఇంత పెద్ద స్థాయిలో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించడం అరుదు.

కారణాలేంటో కానీ.. ఈసారి రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడానికి మెగా ఫ్యామిలీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చిరంజీవి పుట్టిన రోజు నాడు కూడా ఇంత హడావుడి ఎప్పుడూ జరగలేదు. ఈ కార్యక్రమానికి రెండు వారాల ముందు నుంచి బాగా ప్రచారం కల్పించారు. ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేశారు. విదేశాల్లో సైతం బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం విశేషం. మెగా ఫ్యామిలీ హీరోలు సైతం ఈ క్యాంపుల నిర్వహణలో చురుకైన పాత్ర పోషించారు. రక్తదానం చేసిన అభిమానులకు కృతజ్నతలు చెప్పడం కోసం చిరంజీవి.. రామ్ చరణ్ నిన్న ప్రత్యేకంగా ఓ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈసారి రెస్పాన్స్ చూసి.. ఇకపై ప్రతి ఏడాది ఇలాగే స్పెషల్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని మెగా ఫ్యామిలీ భావిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,