Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2017 11:58:08
facebook Twitter Googleplus
Photo

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా బోలెడంత ఇమేజ్ ఉన్న రాజశేఖర్.. చాలా కాలంగా ఫామ్ లో లేడు. అయినా సరే.. ఎంతో నమ్మకంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం పీఎస్వీ గరుడవేగ. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సూపర్బ్ గా టాక్ అయితే వచ్చింది కానీ.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు ఆ స్థాయిలో కనిపించడం లేదు.

గరుడవేగ సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశాలు పెద్దగా లేవు. భారీ లాభాలు అందుకునే పరిస్థితి అయితే బాక్సాఫీస్ దగ్గర కనిపించడం లేదు. ఇప్పటివరకు సినిమాకు కేవలం 5 కోట్లు షేర్ రాగా.. మరో 9 కోట్లు షేర్ వస్తేనే ప్రాఫిట్ జోన్లోకి వస్తుంది. అయితే కలక్షన్ల విషయంలో ఎలా ఉన్నా కానీ.. ఇతర ఫార్మాట్స్ లో మాత్రం మంచి లాభాలే కళ్ల చూసేలా ఉన్నాడు రాజశేఖర్. నిర్మాణంలో కూడా ఆయన కీలకం కావడంతో.. ఇతర హక్కుల రూపంలో భారీ మొత్తాలే వస్తున్నట్లుగా తెలుస్తోంది. గరుడవేగ మూవీకు సూపర్బ్ టాక్ రావడం.. జనాలు కూడా మెచ్చడంతో.. భారీ మొత్తానికే శాటిలైట్ హక్కులను విక్రయించారట. ఇక సన్నీ లియోన్ ఈ మూవీలో ఐటెం సాంగ్ లో నటించడంతో.. హిందీ శాటిలైట్ రూపంలో కూడా పెద్ద మొత్తంలో అందుకున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు డిజిటల్ ఫార్మాట్ హక్కులకు కూడా మంచి డిమాండ్ నెలకొనడం విశేషం. ఇక పలు భాషల నుంచి రీమేక్ ఆఫర్స్ కూడా తెగ వస్తున్నాయి. ఇప్పటికే తమిళ రీమేక్ రైట్స్ కు సంబంధించి చాలామంది అడగగా.. ఓ మంచి రేటు వద్ద గరుడవేగ తమిళ్ రైట్స్ ను విక్రయించేందుకు ఒప్పందం కుదిరినట్లుగా చెప్పుకుంటున్నారు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఫేర్ చేయలేకపోయినా.. గరుడవేగతో రాజశేఖర్ సూపర్బ్ ప్రాఫిట్స్ అందుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,