Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2017 12:43:15
facebook Twitter Googleplus
Photo

బాహుబలి2 ఘన విజయంతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు నేషనల్ లెవెల్ ఐకాన్ అయిపోయాడు ప్రభాస్. అదే స్థాయిలో బ్రాండ్ అండార్స్ మెంట్స్ కోసం ఆఫర్స్ కూడా వస్తున్నాయి. కానీ యాడ్స్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్న ప్రభాస్.. ఇప్పుడు ఓ మొబైల్ కంపెనీకి సైన్ చేశాడట.

బాహుబలి యాక్టర్ ప్రభాస్ తో తాము ఒప్పందం చేసుకున్నట్లు మొబైల్ తయారీ సంస్థ జియోనీ ఇండియా ప్రకటించింది. ప్రభాస్ తో అగ్రిమెంట్ కారణంగా ఇండియాలో తమ ప్రెజెన్స్ మరింతగా పెరుగుతుందని జియోనీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే దేశంలో కోటీ పాతిక లక్షల మందికి పైగా కస్టమర్లను కలిగి ఉన్న తమ కంపెనీకి.. ప్రభాస్ తో అగ్రిమెంట్ చేసుకోవడం ప్లస్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ కు చాలామందే అంబాసిడర్స్ ఉన్నారు. ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ భామ ఆలియా భట్.. సౌత్ బ్యూటీ శృతి హాసన్ లతో పాటు దుల్కర్ సల్మాన్.. దిల్జిత్ దోసంఝ్ కూడా ఈ కంపెనీ ఫోన్లకు ప్రచారం చేస్తున్నారు.

ఇక ప్రభాస్ తన కొత్త సినిమా సాహో కోసం పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవుతున్నాడు. రీసెంట్ గా యంగ్ రెబల్ స్టార్ కొత్త లుక్ లో దర్శనం ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చేశాడు కూడా.

,  ,  ,  ,  ,