Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Nov-2016 10:57:58
facebook Twitter Googleplus
Photo

పెద్ద నోట్ల రద్దు కారణంగా టాలీవుడ్ లో సాహసం శ్వాసగా సాగిపో మూవీ రిజల్ట్ చూసిన తర్వాత కూడా.. ఎక్కడికి పోతావు చిన్నవాడా ను ధైర్యంగా రిలీజ్ చేస్తున్నాడు నిఖిల్. పోటీ లేకుండా సోలోగా థియేటర్లలోకి వస్తుండడం కలిసొచ్చే విషయం అయినా.. అసలు థియేటర్లకు జనాలు వస్తారా అన్నదే అసలు పాయింట్.

ఇప్పుడు నిఖిల్ కి ఆశ కలిగిస్తూ ఓ నిర్ణయం వెలువడింది. అయితే.. ఇది ప్రస్తుతం పక్క రాష్ట్రాలకు మాత్రమే. 'ఇది చాల అద్భుతమైన వార్త. కన్నడ.. మరాఠీ సినిమాల్లో అన్ని కరెన్సీ నోట్లను అంగీకరిస్తున్నారు. ఇవాల్టిలోగా మనం కూడా ఈ వార్త వినచ్చని అనుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. కన్నడ ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న సమస్యలు చూసి.. ఈ నెల 30వరకూ పాత నోట్లను అంగీకరించేందుకు ఆమోదం లభించింది. అలాగని కేవలం పెద్ద నోట్లను తీసుకుని సరిపెట్టేయమని.. సరిపడే చిల్లర ఇస్తామని చెబుతున్నారు థియేటర్ యజమానులు. ప్రజలకు పూర్తిగా కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చే వరకూ ఈ ఏర్పాటు కోసం ఇండస్ట్రీ వర్గాలు పోరాటం చేసి సాధించుకున్నాయి.

ఇప్పుడు నిఖిల్ కూడా అదే ఆశలు పెట్టుకున్నాడు. ఒకవేళ ఇదే సాధ్యమైతే మాత్రం.. చిన్నవాడు పండగ చేసేసుకోవడం ఖాయం.

,  ,  ,  ,