Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jan-2015 10:36:32
facebook Twitter Googleplus
Photo

ఒకప్పుడు సూపర్ హిట్స్ తీసిన ప్రముఖ దర్శకుడు బి.గోపాల్, ఇటీవలి కాలంలో ప్రవేశించిన కొత్తనీరు ధాటికి వెనుకపడిపోయారు. ఆమధ్య గోపీచంద్ హీరోగా ఓ చిత్రాన్ని ప్రారంభించినప్పటికీ అది మొదట్లోనే ఆగిపోయింది. గోపాల్ టేకింగ్ స్టయిల్ నచ్చక గోపీచంద్ ఆ చిత్రాన్ని ఆపేశాడని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, మళ్లీ వీరిద్దరి మధ్యా టర్మ్స్ కుదరడంతో, ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నారు. తాండ్ర రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక కాగా, మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవలే తనకు 'లౌక్యం'తో విజయం వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని గోపీచంద్ ప్రారంభించడం గమనార్హం!

,  ,  ,  ,