Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2017 12:44:24
facebook Twitter Googleplus
Photo

గోపిచంద్ సినిమా కెరీర్ ఇప్పుడు కాస్త యావరేజ్ గా ఉంది. జిల్ వంటి డిజష్టర్ తరువాత కోలుకోవడానికి టైమ్ పడుతోందనే చెప్పాలి.. ఇప్పుడు నెమ్మదిగా వేగం పెంచాడు గోపి. ఈ మధ్య ఓ మూడు సినిమాలు షూటింగ్ ఐతే జరుగుతున్నాయి కానీ ఇంకా ఏవి విడుదల కాలేదు.

గోపి చంద్ ఇంత వరుకు ఎప్పుడు డ్యుయల్ రోల్ చేయలేదు. కెరీర్ మొదటిలో ప్రతినాయకుడుగా చేసి అందరిచే శబాష్ అనిపించుకున్నాడు. తరువాత హీరోగా మారాక కొన్ని సినిమాలు తన మార్కెట్ ని పెంచుతూ వచ్చాయ్. అయితే చాన్నాళ్ళ తరువాత ఇప్పుడు తనే నెగెటివ్ రోల్ చేయాలని ఫిక్సయిపోయాడట. ఇప్పుడు ఈ వేసవి లో వస్తున్నా ''గౌతంనంద'' సినిమాలో మొదటి సారిగా డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. ఇటు హీరోగా అటు విలన్ గా ఆకట్టుకుంటాడని టాక్.

గౌతంనంద సినిమాకు సంపత్ నంది డైరెక్టర్ అనే విషయం తెలిసిందే. మొత్తం షూటింగ్ ఐతే పూర్తి అయింది అని చెపుతున్నారు ఆ చిత్రా నిర్మాణ సంస్థ. ఈ వేసవి సెలవు లలో విడుదల చేయడానికి అన్నీ ఏర్పాటులు చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,