Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Aug-2016 12:28:56
facebook Twitter Googleplus
Photo

లౌక్యంతో ఫాం లోకి వచ్చి సౌఖ్యం తో ఫ్లాఫ్ తిన్నాడు గోపి చంద్. ఐతే ఇప్పుడో ఫ్లాఫ్ నుండి తప్పించుకున్నాడు. అదెలాంటే.. సుశాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ?ఆటాడుకుందాం రా? ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ సినిమా డిజాస్ట‌ర్ లిస్టులో చేరిపోయింది. క‌థ‌లో కొత్త‌ద‌నం లేద‌ని, వినోదంలో ప‌స లేద‌ని తేల్చేస్తున్నారు సినిమా చూసిన జనాలు. దాంతో సుశాంత్ ఖాతాలో మ‌రో ఫ్లాప్ చేరిపోయిన‌ట్టైంది.

వాస్తవానికి ఈ ఫ్లాపు గోపీచంద్‌కి త‌గ‌లాల్సింది. ఎందుకంటే ఈ క‌థ ముందు గోపీచంద్ ద‌గ్గ‌ర‌కే వెళ్లింది. శ్రీ‌ధ‌ర్ సిపాన దర్శకుడిగా ఈ సినిమా తీయాలని అనుకున్నారు. అయితే కధ విషయంలో ఎక్కడి గురి కుదరలేదు గోపికి. దీంతో ఈ కధ సుశాంత్ కి వెళ్ళడం, మరో ఫ్లాఫ్ సుశాంత్ ఖాతాలో పడటం జరిగిపోయింది. ఈ రకంగా ఓ ఫ్లాఫ్ నుండి భయపడ్డాడు గోపి.

,  ,  ,  ,  ,