Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2015 18:05:00
facebook Twitter Googleplus
Photo

విడుదలకు ముందు తర్వాత ?రుద్రమదేవి?కి ఎన్నెన్ని అడ్డంకులో. వాటన్నింటినీ తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర అసాధారణ విజయాన్ని నమోదు చేసింది గుణశేఖర్ సినిమా. ?రుద్రమదేవి? మీద పెట్టిన పెట్టుబడితో పోలిస్తే నష్టమే వచ్చి ఉండొచ్చు కానీ.. ఈ సినిమా మీద జనాలకు ఉన్న అంచనా ప్రకారం అయితే సినిమా అద్భుత విజయం సాధించినట్లే లెక్క. నెగెటివ్ టాక్ ను విపరీతమైన పోటీని తట్టుకుని రూ.50 కోట్ల షేర్ సాధించడమంటే చిన్న విషయం కాదు. పైగా ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా. సినిమా జనాలకు ఎంత బాగా నచ్చింది అన్నది పక్కనబెడితే.. గుణశేఖర్ ఏమైపోతాడో అని ఆందోళన చెందడం అతను బయటపడాలని కోరుకోవడం సినిమా గురించి పాజిటివ్ గా ప్రచారం చేయడం.. థియేటర్లకు రావడం.. ఇలాంటి చిత్రాలన్నీ చోటు చేసుకున్నాయి ?రుద్రమదేవి? విషయంలో.

ఇప్పటికీ ?రుద్రమదేవి? విషయంలో గుణశేఖర్ పరిస్థితి ఏంటి అన్నది తెలుసుకోవాలని జనాల్లో చాలా ఆసక్తి ఉంది. కానీ ఈ విషయంలో క్లారిటీనే రావడం లేదు. సినిమా విడుదలైనపుడు ఒకసారి దాసరి నారాయణ రావుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టాడు గుణ. మళ్లీ పత్తా లేడు. సినిమాను సరిగా ప్రమోట్ చేయలేదు కూడా. అయినా బాగానే ఆడింది. అతను ప్రమోషన్ చేసి ఉంటే ఇంకా మంచి వసూళ్లు వచ్చేవేమో. ఆ ప్రమోషన్ సంగతి పక్కనబెడితే.. తనపై అసాధారణమైన ప్రేమ చూపించిన జనాలకు కృతజ్నతలు చెప్పడానికి కూడా మళ్లీ మీడియా ముందుకు రాలేదు. ?రుద్రమదేవి? కలెక్షన్ల గురించి కానీ.. తాను బయటపడ్డానా లేదా అన్న విషయం గురించి కానీ.. తన తర్వాతి ప్రాజెక్టు గురించి కానీ.. ఏమీ మాట్లాడలేదు గుణ. రుద్రమదేవి బాక్సాఫీస్ దగ్గర ఎంత బాగా పెర్ఫామ్ చేసినప్పటికీ గుణకు భారీ నష్టం తప్పలేదని.. ఫైనాన్షియర్లతో వ్యవహారాలు చక్కదిద్దుకోవడంలోనే సతమతమవుతున్నాడని.. అందుకే ఎక్కడా బయట కనిపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ లో. మరి గుణ ఎప్పుడు సైలెన్స్ బ్రేక్ చేస్తాడో?

,  ,  ,