Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2015 15:47:11
facebook Twitter Googleplus
Photo

మరో మూడు రోజుల్లో తెరపైకి రానుండడంతో.. రుద్రమదేవి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు దర్శకుడు గుణశేఖర్. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ.. లేడీ ఓరియెంటెడ్ అయినా.. గోన గన్నారెడ్డి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాత్రను అల్లు అర్జున్ చేయడంతో.. మూవీకి స్టార్ స్టేటస్ వచ్చిన మాట వాస్తవం. అయితే ఈ రోల్ కోసం ముందు జూనియర్ ఎన్టీఆర్ ని అడిగాడట డైరెక్టర్.

పాత్ర తీరుతెన్నులు చూసిన ఎన్టీఆర్ బాగా ఎగ్జయిట్ అయ్యాడని తప్ప కుండా చేస్తానని చెప్పినా.. ఓ కండిషన్ పెట్టాడట. ఈ పాత్రను మరింతగా డెవలప్ చేసి హీరోగా మార్చాలన్నది యంగ్ టైగర్ కండిషన్. రుద్రమదేవి పాత్రనే మెయిన్ లీడ్ చేయాలన్న కోరిక తీరదనే ఉద్దేశ్యంతో.. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి ఎన్టీఆర్ ను వదులుకోవాల్సి వచ్చిందని చెబ్తున్నాడు గుణ. అంతే కాదు.. చిరంజీవితో చూడాలని ఉంది హిట్ కొట్టాక మృగరాజులాంటి అట్టర్ ఫ్లాప్ తీయడానికి కూడా కారణం చెప్పుకొచ్చాడు. అది తన స్టోరీ కాదని.. ఘోస్ట్ అండ్ ది డార్క్ నెస్ మూవీ ఆధారంగా నాగబాబు తయారు చేయించిన స్టోరీ అని చెప్పాడు.

మహేష్ తో చేసిన అర్జున్ ఫ్లాప్ కావడానికి కారణం కూడా గుణకి తెలుసంట. ఒక్కడు తర్వాత రావడంతో.. ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిలయ్యానని... తనకు మహేష్ కు బ్లాక్ మార్క్ అయిపోయిందని చెప్పాడు గుణ. తన టేకింగ్ - ట్యాలెంట్ పై నటీనటులు చాలా విశ్వాసం ఉంచుతారన్న గుణ శేఖర్... వరుడు ఫ్లాప్ అయినా.. అల్లు అర్జున్ రుద్రమలో గెస్ట్ రోల్ చేయడాన్ని గుర్తు చేస్తున్నాడు. రుద్రమదేవి కోసం తన శక్తియుక్తులనే కాకుండా.. ఆస్తి పాస్తులను కూడా ధారపోసేశాడు గుణశేఖర్. ఈ ప్రాజెక్ట్ తిరుగులేని సక్సెస్ సాధించడం ఇప్పుడు గుణకు చాలా కీలకం.

,  ,  ,