Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jun-2016 14:35:48
facebook Twitter Googleplus
Photo

ఒకే టైపు కథతో రెండేసి సినిమాలు రావడం పెద్ద వింతేం కాదు. ముఖ్యంగా లవ్ స్టోరీల విషయంలో ఇది జరుగుతూనే ఉంటుంది. చెప్పదలచుకున్న పాయింట్ నే కొంచెం వేరియేషన్ తో చూపించేస్తారు దర్శకులు. కానీ ఒకే స్టోరీతో రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవడం అంటే.. అది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

ఓ కుర్రాడు.. తోటి అమ్మాయితోనో - కాలేజ్ లో క్లాస్ మేట్ తోనో ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పేస్తుంది. ఇంకేముంది ఫస్టాఫ్ అంతా కాలేజ్ లో కామెడీ - లవ్ స్టోరీ నడిపించడం.. అంతా ఓ హంగామా. ఇలా సాగే సరికి ఇంటర్వెల్ వచ్చేస్తుంది.. అక్కడో ట్విస్ట్. చిన్నా చితకా కారణాలేవో చూపించుకుని ఒకరికొకరు బ్రేకప్ చెప్పేసుకుని విడిపోతారు. ఇక ఇంటర్వెల్ తర్వాత ఇంకో అమ్మాయి లైన్ లోకి వస్తుంది. కానీ మన హీరో మాత్రం ప్రపంచంలో అందరికంటే బెస్ట్ తన లవర్ మాత్రమే అని గ్రహించేసి.. ఈ రెండో అమ్మాయికి హ్యాండ్ ఇచ్చేస్తాడు.

ఇదేమీ కొత్త స్టోరీ కాదు.. జనాలకు తెలీని లైన్ అంతకంటే కాదు. కానీ ఈ వారం రిలీజ్ అయిన గుప్పెడంత ప్రేమ - మీకు మీరే మాకు మేమే చిత్రాలు రెండూ ఇదే లైన్ లో సాగుతాయి. లవ్ స్టోరీల మీద ప్రేమతో థియేటర్స్ కి వెళ్లినవాళ్లు.. రెండు సినిమాలు ఒకేలా ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

,  ,  ,  ,  ,