Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2016 10:11:23
facebook Twitter Googleplus
Photo

హన్సిక మొత్వానికి పెద్ద కష్టం వచ్చేసింది. ఆమె కడు పేదరాలైపోయింది. మురికివాడలో బతికేస్తోంది. దీనికంతటికీ కారణం సంపత్ నందే. అతను దర్శకత్వం వహిస్తున్న హన్సికకు అలాంటి పాత్ర ఇచ్చాడు మరి. మిల్కీ అందంతో మెరిసిపోయే హన్సికకు పేదరాలి పాత్ర ఇవ్వాలని ఎలా అనిపించిందో కానీ.. సంపత్ మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించాడు. గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హన్సిక పేద కుటుంబానికి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. ఆమెకు ఈ సినిమా అంతటా అస్సలు మేకప్పే ఉండదట. కెరీర్లో హన్సిక మేకప్ లేకుండా నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

ప్రస్తుతం ఓ మురికివాడలోనే ఈ చిత్ర షెడ్యూల్ సాగుతోంది. గోపీచంద్ కూడా ఈ షెడ్యూల్ కోసం అసలు మేకప్పే వేసుకోకపోవడం విశేషం. బ్యాంకాక్ లో ఒక భారీ షెడ్యూల్ చేశాక.. హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన సంపత్ నంది అండ్ టీమ్ శరవేగంగా కొత్త షెడ్యూల్ పూర్తి చేస్తోంది. సంపత్ గత చిత్రాలకు భిన్నంగా కొంచెం రియలిస్టిగ్గా సాగుతుందట ఈ చిత్రం. అలాగని కమర్షియల్ హంగులకు ఏమీ లోటుండదు. భగవాన్-పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ నందా అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇది ?అత్తారింటికి దారేది?లో పవన్ పాత్ర పేరన్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,