Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jul-2015 15:19:52
facebook Twitter Googleplus
Photo

బొద్దుగుమ్మ హన్సిక దక్షిణాదిన తన సినీ ప్రయాణాన్ని తెలుగు సినిమాతోనే మొదలెట్టినప్పటికీ, సక్సెస్ అయింది మాత్రం తమిళంలోనే అని చెప్పాలి. తెలుగులో అడపాదడపా నటిస్తున్నప్పటికీ, ఎందుకోగానీ ఆమె రేంజ్ మాత్రం పెరగడం లేదు. అదే సమయంలో తమిళంలో మాత్రం చిన్నా పెద్దా అన్న భేదం లేకుండా అందరు హీరోలతోనూ ఎడాపెడా సినిమాలు చేసేస్తోంది. అక్కడ ఎప్పుడూ ఆమె చేతిలో ఐదారు సినిమాలు వుంటూనే ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిన్నది మరో తమిళ చిత్రానికి సంతకం చేసింది. ఆమధ్య హిందీలో వచ్చిన 'జాలీ ఎల్.ఎల్. బి' చిత్రాన్ని అహ్మద్ దర్శకత్వంలో ఇప్పుడు తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా నటించడానికి హన్సిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

,  ,