Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2016 11:49:17
facebook Twitter Googleplus
Photo

ఎర్రగా.. బొద్దుగా... రౌండ్ ఫేస్ తో కాశ్మీరీ యాపిల్ లా నిగనిగలాడేది హన్సిక. ఆ ఆకారమే తమిళ తంబీలకి భలే ఇదిగా నచ్చింది. అందుకే ఆమెని జూనియర్ ఖుష్బూ అంటూ ఆరాధించారు. ఏకంగా గుడులు కూడా కట్టేశారు. ఆ అభిమానాన్ని చూసే హన్సిక చెన్నైలోనే సెటిల్ అయిపోయింది. తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చినా - తెలుగు నుంచి బోలెడు అవకాశాలొస్తున్నా ఆమె మాత్రం తమిళంకే తొలి ప్రయారిటీ ఇచ్చింది. మధ్యలో కాస్త సమయం ఉందంటే అప్పుడు తెలుగులో సినిమాలు చేసేది.

అయితే ఏమైందో ఏంటో కానీ.. ఈమధ్య హన్సిక బాగా చిక్కింది. అసలు ఇక్కడ ఉన్నది హన్సికనేనా అనిపించేలా ఆమె తన ఫిజిక్ని మార్చుకొంది. సినిమాల కోసమో లేదంటే మరీ లావైపోతే ఇబ్బందులొస్తాయనో తెలియదు కానీ... హన్సిక మాత్రం జీరో సైజ్ భామలాగా మారిపోయింది. చక్కనమ్మ చిక్కినా అందమే అంటుంటారు కదా అలా హన్సిక ఎంత స్లిమ్ముగా తయారైనా అందాన్ని మాత్రం కోల్పేలేదు. అదే నిగనిగలతో కుర్రాళ్లని పడగొట్టే ప్రయత్నం చేస్తోంది. అన్నట్టు ఇటీవల తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడానికి ఒప్పుకొంది హన్సిక. తెలుగు ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకొనే ఆమె తన అవతారాన్నిమార్చుకొందో ఏంటో అంటున్నారు సినీ జనాలు

,  ,  ,  ,  ,