Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2017 13:37:27
facebook Twitter Googleplus
Photo

హను రాఘవపూడి ప్రస్తుతం సస్సెస్ ఫుల్ ట్రాక్ లో ఉన్నాడు. నాని తో తీసిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సారి లై సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా గురించి రీసెంట్ గా హను ఓ ఇంటర్వ్యూలో కోన్నీ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

మొదట్లో లై కథను నితిన్ కి చెప్పినప్పుడు ఆయన తన పాత్రను కొద్దిగా డెవలప్ చేయమని అడిగారట. దీంతో హను నితిన్ బాడీ లాగ్వేజ్ కి తగ్గట్టుగా కథలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను జోడించాడట దీంతో నితిన్ వెంటనే ఒకే చెప్పేసి సినిమాలో కొత్త తరహా లుక్ కోసం చాలా కష్టపడ్డాడట. అదే విధంగా అర్జున్ ఇందులో ప్రతి నాయకుడిగా అలరిస్తాడని చెబుతూ.. ఆ పాత్ర కంటే ఎక్కువగా నితిన్ పాత్రే.. ఆకట్టుకుంటుందని చెప్పాడు. ఇక అబద్దం అనే లైన్ తో సాగే ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుందని వివరించారు. లై సినిమా దాదాపు 80% షూటింగ్ ను అమెరికా పరిసర ప్రాంతాల్లోనే చేశారట. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి సన్నివేశం చాలా రిచ్ గా కనిపిస్తుంది. అందుకు కారణం 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ అని హను తెలిపాడు.

రామ్ అచంట- గోపీచంద్ అచంట- అనిల్ సుంకర అనే ప్రొడ్యూసర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

,  ,  ,  ,