Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Aug-2015 17:18:04
facebook Twitter Googleplus
Photo

సాయిధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'. రెజీన కథానాయిక. సెప్టెంబర్ 24న ఈ సినిమా రిలీజవుతోంది. ఈనెల 23న మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధులుగా ఆడియో రిలీజవుతోంది. ఈ సినిమా కథ గురించి హరీష్ శంకర్ ముచ్చటిస్తూ ...

'ఇదో ఎన్నారై కథ. ట్యాలెంట్ అమ్ముకునే ఎన్నారై స్టోరీ. అయితే అతడు ఎందుకు ట్యాలెంటును అమ్ముకోవాల్సొచ్చిందన్నది తెరపైనే చూడాలి. ఇలా అమ్ముకోవడానికి ఓ ప్రత్యేకమైన కాజ్ ఉంటుంది. అది ప్రస్తుతానికి సస్పెన్స్'' అని చెప్పాడు. టైటిల్ ని జస్టిఫై చేసే సినిమా ఇది. సాయిధరమ్ -రెజీన కాంబినేషన్ లో మరో హిట్ సినిమా అవుతుందన్న ధీమా ఉంది. రెజీన ఈ చిత్రంలో అద్భుతంగా నటించింది. పవర్ చిత్రంలో తన నటన చూసి ఎంపిక చేసుకున్నానని హరీష్ చెప్పాడు.

రామయ్యా వస్తావయ్యా ఫెయిల్యూర్ ని నేను పట్టించుకోలేదు. జయాపజయాలు అనేవి వస్తుంటాయి. వెళుతుంటాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో గబ్బర్ సింగ్ కి పనిచేశాక నా దృక్పథంలో మార్పొచ్చింది. కేవలం పనిని నమ్ముకో. గెలుపోటముల్ని పట్టించుకోకు అన్నది అర్థమైంది.. అని చెప్పాడు. అలాగే ఈ చిత్రంలో మెగాస్టార్ సాంగ్ ఒకటి రీమిక్స్ చేశాం. అదేంటో సర్ ప్రైజ్. తెరపైనే చూడండి అంటూ చెప్పుకొచ్చాడు.

,  ,  ,