Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2017 13:40:25
facebook Twitter Googleplus
Photo

మెగా హీరో వరుణ్ తేజ్ రీసెంట్ మూవీ.. మిస్టర్ దారుణంగా దెబ్బేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఏ మాత్రం నిలబడలేదు. తొలిరోజు తొలి ఆట నుంచి వచ్చిన బ్యాడ్ టాక్.. మూవీ రిజల్ట్ పై గట్టిగానే ఎఫెక్ట్ చూపిందనే చెప్పాలి. దర్శకుడు శ్రీను వైట్ల ఎంతగా మనసు పెట్టి చేసినా.. హీరో వరుణ్ తేజ్ ఎంత కొత్తగా ట్రై చేసినా.. పెద్దగా ప్రయోజనమేమీ దక్కలేదు.

ఇప్పుడు వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ ఫిదాపై అందరి దృష్టి పడింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ.. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో హర్షవర్ధన్ రాణేను కీలక పాత్రలోకి తీసుకున్నాడట దర్శకుడు. యాక్టింగ్ పరంగా ట్యాలెంట్ ఉన్నా.. ఈ కుర్రాడికి ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే స్టాంప్ ఉంది. రవిబాబు తీసిన 'అవును' మినహాయిస్తే.. హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించగా.. హిట్ అయిన సినిమా ఒక్కటంటే ఒక్కటి లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే రూపొంది.. నయనతార ప్రధాన పాత్రలో నటించిన అనామిక డిజాస్టర్ అయిపోయింది. అందుకే ఇప్పుడు హర్షవర్దన్ కు మించి మీకు మరో నటుడు దొరకలేదా అంటూ మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఇప్పుడు ఫిదాలో ఈ హర్షవర్ధన్ అనగానే మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

,  ,  ,  ,  ,  ,