Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2017 12:15:48
facebook Twitter Googleplus
Photo

ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో సగానికి సగం ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఎప్పుడు వెళ్లిపోతున్నాయో ఎవరికీ తెలియదు. కొన్ని మధ్యలో ఆగిపోతే కొన్ని కిందా మీదా పడుతూ ఫైనల్ గా థియేటర్స్ వరకు వస్తున్నాయి. అయితే కొన్ని చిన్న సినిమాలు మాత్రం అప్పుడపుడు చిన్న తారాజువ్వల్లా మెరిసి ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి. అదే తరహాలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న చిత్రం హౌరా బ్రిడ్జ్.

రాహుల్ రవిచంద్రన్ హీరోగా యూట్యూబ్ హాట్ బ్యూటీ చాందిని చౌదరి హీరోయిన్ గా తెరక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇప్పటికే ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లోనే హీరోయిన్ చాందిని తెగ హాట్ గా కనిపించింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టెయినర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు.. పెంచేందుకు చిత్ర యూనిట్ కూడా చాలా తాపత్రయపడుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన కొన్ని ఫోటోలను చూస్తుంటే చాందిని లిమిట్స్ లేకుండా నటించేసిందా అనే సందేహం కలగక మానదు.

చాందిని - రాహుల్ పై ఉన్న ఓ ఫొటో చూస్తుంటే అమ్మడి రొమాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి సినిమాలు చాలావరకూ పోస్టర్ల వరకే ఎక్కువగా ఆకర్షించగలుగుతున్నాయి. మూవీలో కంటెంట్ లేకపోతే.. ఎలాంటి పోస్టర్స్ అయినా ఏం చేయలేవు.

,  ,  ,  ,  ,